YSRCP vs TDP: కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతోన్న ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఓవైపు పులివెందుల, మరో వైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేసేందుకు అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇటు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. అయితే, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. టీడీపీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.. విద్యావంతులు టీడీపీలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరడం ఆనందంగా ఉందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు..
Read Also: The Paradise : ది ప్యారడైజ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
ఈ రోజు ఒంటిమిట్ట మండలం, సాలాబాద్ గ్రామం, కాలనీల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించాం.. ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండల ఎంపీపీ అక్కి లక్ష్మీదేవితో పాటు తిప్పల వెంకట కృష్ణారెడ్డి, చింతం శ్రీనివాసరెడ్డి కుటుంబాల ఆధ్వర్యంలో వైసీపీని వీడి పలువరు నేతలు టీడీపీలో చేరారని.. వీరందరికీ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు.. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ జడ్పీటీసీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారని సోషల్ మీడియాలో వెల్లడించారు..
