ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. టీడీపీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు..