Site icon NTV Telugu

Vladimir Putin – Kim Jong Un : కిమ్ ను సరదాగా కారులో తిప్పిన పుతిన్.. వీడియో వైరల్..

Puthin

Puthin

Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలో తయారు చేసిన ఆరస్ లిమోసిన్ అనే లగ్జరీ కారులో ఇద్దరు నేతలు ప్రయాణించారు. నలుపు రంగు ఆరస్ కారు రష్యా అధ్యక్షుడి అధికారిక కారు. అధ్యక్షుడు పుతిన్ ఈ కారులో పార్క్ గుండా కిమ్‌ తో కలిసి ప్రయాణించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు భవనంలోకి ప్రవేశించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇదిలా ఉండగా., అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ కు నల్లటి ఆరస్‌ కారును బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు కిమ్‌కి అదే కారును అధ్యక్షుడు పుతిన్ బహుమతిగా ఇచ్చారు. దింతో ఆయన రెండు టొయామా కుక్కపిల్లలను బహుమతిగా అందుకున్నట్లు సమాచారం.

Prabuthwa Junior Kalashala Review: ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ

కిమ్ జోంగ్ ఉన్ కారు ప్రియుడు. ఆయన రకరకాల లగ్జరీ కార్లను ఇష్టపడతారు. కిమ్ వివిధ కంపెనీల నుండి లగ్జరీ కార్లను సేకరిస్తారు. అయితే ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షల కారణంతో ఆయన నేరుగా ఆయా కంపెనీల నుండి కార్లను కొనుగోలు చేయలేరు. అతను తన అభిమాన విదేశీ కార్లను ఉత్తర కొరియా లోకి స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకుంటారని సమాచారం. కిమ్ ప్రస్తుతం రష్యాలో తయారు చేసిన లిమొసిన్ పాటు మెర్సిడెస్, రోల్స్ రాయిస్, ఫాంటమ్ అలాగే లెక్సస్‌ తో సహా వివిధ దేశాలు తయారు చేసే లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

Exit mobile version