Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘ఏపీ పోలీస్ సేవా పోర్టల్’ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎక్కడెక్కడ అనుమతులు తీసుకోవాలనే ఇబ్బంది లేకుండా పోలీస్, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సహా విద్యుత్ శాఖల నుంచి కూడా ఆన్లైన్ ద్వారానే ఒకేసారి క్లియరెన్స్ పొందేలా చర్యలు చేపట్టారు.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా నిర్వాహకులు ప్రతిపాదిత విగ్రహం ఎత్తు, ఉపయోగించే పదార్థాలు, ఉపయోగించే స్థలం, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను పక్కాగా పొందుపరచాల్సి ఉంటుంది. ప్రజా ప్రశాంతతకు విఘాతం కలగకుండా మండప నిర్వాహకులు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్ సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే దర్శనాల పేరుతో లేదా చందాల పేరుతో ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటం తీవ్ర నేరమని, అటువంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. భక్తులకు స్వచ్ఛందంగా సౌకర్యాలు కల్పించాలి తప్ప ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకూ తావివ్వకూడదు.
Also Read
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
- Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
- Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
భారీ విగ్రహాలు, పెద్ద మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, రాత్రి వేళల్లో స్వచ్ఛంద సేవకుల కాపలా వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా అవాంఛనీయ సంఘటనలను అరికట్టాలి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించాలని యంత్రాంగం పిలుపునిచ్చింది. అలాగే పండుగ ముగింపు సందర్భంగా నిర్వహించే నిమజ్జనం, శోభాయాత్రల సమయంలో అధిక శబ్దాలు చేసే డిజేలు, లౌడ్ స్పీకర్లను ఉపయోగించడంపై పూర్తి నిషేధం విధించారు. ఈ నిబంధనలన్నింటినీ పాటిస్తూ ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు.
తాజావార్తలు
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
-
Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!