Vizag Ayesha Masjid Case: వక్ఫ్ బోర్డుకు హైకోర్టు చురకలు.. ఉత్తర్వులు అమలుచేయకపోవడంతో అధికారికి కోర్టు ధిక్కరణ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Ayesha Masjid Case: విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లోని అయేషా మసీదు పేరుతో ఉన్న అనధికార కట్టడంపై వివాదం మళ్లీ హైకోర్టు దృష్టికి వచ్చింది. హైకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వక్ఫ్ బోర్డు, జీవీఎంసీ అధికారులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాగర్‌నగర్ లేఅవుట్ సొసైటీకి చెందిన స్థానికులు, ఆ మసీదు కట్టడం అనధికారమని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే విచారణ అనంతరం ఆ కట్టడంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వుల అమలుపై వక్ఫ్ బోర్డు రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
తాజాగా ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జీవీఎంసీ కమిషనర్‌పై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సొసైటీ తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. అనధికార కట్టడంపై నకిలీ పత్రాలతో పిటిషన్ వేసినట్లు వక్ఫ్ బోర్డు ప్రవర్తనను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆ కట్టడాన్ని తక్షణమే కూల్చివేయాలని కోరారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సక్రమమని అభిప్రాయపడింది. అనధికార కట్టడాన్ని తొలగించాలని ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ.. వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో సాగర్‌నగర్‌లోని అయేషా మసీదు వివాదంపై మరోసారి స్పష్టత వచ్చినట్టయింది. హైకోర్టు నిర్ణయంతో జీవీఎంసీ అధికారులు అనధికార నిర్మాణంపై చర్యలు తీసుకోనున్నారు.
Nagarjuna – Konda Surekha : కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగర్జున
తాజావార్తలు
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?