Vivo Y50m 5G, Y50 5G: కేవలం రూ.13,000ల ప్రారంభ ధరకే ఇన్ని ఫీచర్లున్న ఫోన్ ఏంటి భయ్యా.. గ్లోబల్ గా విడుదలైన కొత్త వివో మొబైల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y50m 5G, Y50 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన తాజా Y సిరీస్ ఫోన్లైన Y50m 5G, Y50 5G మోడల్స్ ను చైనా మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, కోర్ స్పెసిఫికేషన్లలో ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి మధ్య తేడా ర్యామ్ వేరియంట్‌లో ఉంది. Y50m 5G మోడల్ 6GB RAM నుంచి ప్రారంభమవుతుండగా, Y50 5G మోడల్ 4GB RAM నుంచి లభిస్తోంది. మరి ఈ కొత్త మొబైల్స్ గురించి పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..
ప్రాసెసర్:
వివో Y50m 5G, Y50 5G మొబైల్స్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. వీటిలో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 52 గంటల టాక్‌టైమ్ అందించగలదని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
CM MK Stalin: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. కొనసాగుతున్న చికిత్స..!

డిస్ప్లే, కెమెరా:
కొత్తగా విడుదలైన వివో Y50m 5G, Y50 5G ఫోన్లు 6.74-అంగుళాల భారీ డిస్ప్లేతో వచ్చాయి. ఇవి 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో స్క్రోల్, గేమింగ్ అనుభవం బాగా ఉంటుంది. ఇక కెమెరా సెక్షన్ విషయానికి వస్తే.. రెండు మొబైల్స్ లో 13MP సింగిల్ రియర్ కెమెరా (f/2.2 అపర్చర్), అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.

సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు:
ఈ రెండు మోడల్స్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, IP64 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, Wi-Fi, USB Type-C, 3.5mm ఆడియో జాక్, OTG, GPS/GLONASS/Beidou/Galileo/QZSS వంటి గ్లోబల్ నావిగేషన్ సపోర్ట్ ఉంది. ఇందులో యాక్సిలెరోమీటర్, ambient లైట్ సెన్సె, e-కంపాస్, ఇన్ఫ్రారెడ్ రిమోట్, proximity సెన్సార్ వంటి అవసరమైనవి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లకు SGS ఫైవ్-స్టార్ డ్రాప్ అండ్ ఫాల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ రెండు మోడల్స్ 167.30×76.95×8.19mm పరిమాణాలతో ఉండగా, వాటి బరువు 204 గ్రాములు ఉంది.
Vidadala Rajini: జనం గుండెల్లో జగన్ ఉన్నారు.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ధర:
Vivo Y50m 5G:
6GB + 128GB – 1,499 యువాన్స్ (సుమారుగా 18,000)
8GB + 256GB – 1,999 యువాన్స్ (సుమారుగా 23,000)
12GB + 256GB – 2,299 యువాన్స్ (సుమారుగా 26,000)

Vivo Y50 5G:
4GB + 128GB – 1,199 యువాన్స్ (సుమారుగా 13,000)
6GB + 128GB – 1,499 యువాన్స్ (సుమారుగా 18,000)
8GB + 256GB – 1,999 యువాన్స్ (సుమారుగా 23,000)
12GB + 256GB – 2,299 యువాన్స్ (సుమారుగా 26,000).
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!