మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి జరుగుతోంది.
READ MORE: Posani Krishna Murali: పోసానిపై మొత్తంగా 17 కేసులు.. అన్ని కేసుల్లో బెయిల్స్..
మెగాస్టార్ చిరంజీవి ఆశిక రంగనాథ్ సహా నటుడు సత్యపై ఈ సీన్ షూట్ చేస్తున్నారు. ఈరోజుతో యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తికాబోతోంది. అయితే సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. రియల్ సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీ లో వచ్చే సాండ్(ఇసుక) యాక్షన్ సీక్వెన్స్ నేటితో ముగించారని అంటున్నారు. అయితే సినిమా మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కూడిన సినిమా కావడంతో పూర్తిగా మంచి అవుట్ పుట్ తో కూడిన గ్రాఫిక్స్ వచ్చాయని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తుంది. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
READ MORE: Team India: నెక్ట్స్ ఏంటీ?.. భారత జట్టు ఏ సిరీస్ ఆడబోతోంది?