Vishwak Sen: ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్‌సేన్. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో లైలా సినిమా తర్వాత చేస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా విశ్వక్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. తన లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ నన్ను హీరోలా ఉన్నావని చెప్పిందని, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నన్ను హీరో అవ్వమనే చెప్పింది. మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్‌గా తీసుకున్నా. అందుకే హీరో అయ్యాను’ అని చెప్పారు. ‘ఫంకీ’ విషయానికి వస్తే.. ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్స్‌లోకి రాబోతుంది. నిజానికి ఈ సినిమాపైన విశ్వక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కయాదులోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ డైరెక్టర్‌గా దర్శకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. లైలా డిజాస్టర్‌తో తన మార్కెట్‌ను ప్రభావితం చేసుకున్న ఈ యువ హీరో ‘ఫంకీ’ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కి, తన మార్కెట్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు.