Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా ఎక్కువగా వివాదాలతో ఫేమస్ అవుతుండడం గమనిస్తూనే ఉంటాము. అలాంటి హీరో ఇప్పుడు తాజాగా భక్తి మూడ్ లోకి వెళ్ళాడు. ఇందుకు సంబంధించి పూర్తి విరాళాలు చూస్తే..
Stock market: మరోసారి రికార్డులు తిరగరాసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ గుడిని ఆయన తాజాగా సందర్శించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విశ్వక్ సేన్ చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకున్నట్లుగా అర్థమవుతుంది. ఈ సందర్బంగా హీరో విశ్వక్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికినట్లు సమాచారం. ఇక గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తర్వాత ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేసినట్లు తెలుస్తోంది. ఇక గుడి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆయనతో భక్తులు ఫోటోలు దిగడానికి ప్రయత్నించారు. అయితే హీరో విశ్వక్ గుడికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు గుడి దగ్గరికి భారీ ఎత్తున ప్రజలు తరలివచారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈమధ్య కల్కి సినిమాపై యూట్యూబర్ ఇచ్చిన రివ్యూ ఆధారంగా అతనిపై విశ్వక్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఆ వీడియో కూడా వైరల్ అయిన సంగతి చూశాము. ఇక ప్రస్తుతం విశ్వక్ మెకానిక్ రాకి, లైలా సినిమాలలో నటిస్తున్నారు.
#VishwakSen visited Chilkur Balaji Temple to seek divine blessings from Lord Venkateswara 🙏@VishwakSenActor #Chilkurbalaji#Venkatesawara #OmNamoVenkatesa #Yedukondalavada #Govinda pic.twitter.com/BnliJLCUWj
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) July 18, 2024