Vishwak Sen: అకౌంట్లో అడ్వాన్స్ చూసి ఎమోషనల్ అయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్ సేన్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ఆయన దాటి వచ్చిన కష్టాలు, తన అకౌంట్లో మొదటిసారి లక్ష రూపాయలు చూసినప్పుడు కలిగిన ఆనందం గురించి తాజాగా ఒక చిట్‌చాట్‌లో పంచుకున్నారు.
Also Read :Mrunal Thakur : దాని కోసం దర్శకుల వెంటపడక తప్పడంలేదు: మృణాల్ ఠాకూర్
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘మా నాన్న మొదట కరాటే నేర్పించేవారు. దానివల్ల ఆదాయం సరిపోక కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లారు. నేను పుట్టినప్పుడు మాకు సొంత ఇల్లు కూడా లేదు. పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని డిగ్రీలో చేరాను. ఒకప్పుడు నా బ్యాంక్ ఖాతాలో రూ. లక్ష ఉంటే చాలు అనుకునేవాడిని. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా విడుదలయ్యాక మొదటిసారి నా అకౌంట్లో అంత డబ్బు చూశాను. అంతకు రెండు రోజుల ముందే ‘హిట్’ సినిమా అడ్వాన్స్ రూపంలో రూ. 50 వేలు పడితే అది చూసి చాలా మురిసిపోయాను’ అని గుర్తుచేసుకున్నారు.
ఇండస్ట్రీలో తనపై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. సినిమాల కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను. అలా ఉంటే ఇండస్ట్రీలో రాణించలేవు అని చాలామంది నన్ను భయపెట్టారు. కానీ మనిషికి క్యారెక్టర్ ముఖ్యం. సినిమా హిట్ అయితే హీరో ఎవరని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు, అదే కథ బాలేకపోతే మనవాడే కదా అని ఎవరూ హిట్ చేయరు. అందుకే నా సినిమాలే నా గురించి మాట్లాడతాయని నేను నమ్ముతాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘ఫంకీ’ (Funky) సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!