తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. తిరిగి రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే పార్టీలో ఉన్నా క్రీయాశీలకంగా పనిచేయనివారితో వరుసగా భేటీ అవుతున్నారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. థాక్రే తో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో ఇద్దరి మధ్య గ్రేటర్ రాజకీయం పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : గ్లామర్ డోస్ పెంచిన బేబమ్మ
పార్టీకి ఉన్నదే రెండు మూడు ఫ్యామిలీలు అని, వాళ్ళను కూడా కలుపుకుని పోకుంటే ఎలా అని విష్ణు అన్నారు. గాంధీ భవన్ కి రావడం లేదంటారని, మాకు సమాచారం ఇస్తున్నది ఎవరు..? అని విష్ణు ప్రశ్నించారు. కొత్త డీసీసీ నియామకం సమాచారం కూడా లేదని విష్ణు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కమిటీలో కనీసం అవకాశం కూడా ఇవ్వలేదని, కొత్త వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్.. పాత వాళ్ళ మీద లేదని థాక్రే ముందు ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు. పార్టీ పదవి ఇప్పుడు ఇస్తా అన్నా తీసుకొనని, పీజేఆర్ లాంటి కుటుంబానికి కూడా గుర్తింపు లేకుంటే ఎలా అని విష్ణు అడిగారు. త్వరలోనే అన్నీ సెటిల్ చేస్తామన్న థాక్రే హామీ ఇచ్చారు.