NTV Telugu Site icon

Manchu Vishnu : త్రివిధ దళాల కుటుంబాల కోసం ముందడుగు వేసిన విష్ణు మంచు

Vishnu Manchu

Vishnu Manchu

Manchu Vishnu : మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు. త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు, వారి పిల్లలకు 50శాతం స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా విష్ణు మంచు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు.

Read Also:Guillain-Barre Syndrome: గులియన్ బారే సిండ్రోమ్(GBS)తో పూణేలో తొలి మరణం..

ఈ మేరకు శ్రీ విష్ణు మంచు మాట్లాడుతూ.. “మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచికంగా, వారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు మా నిర్ణయం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాన’ని అన్నారు.

Read Also:Samsung Smart TV: ఇది కదా డీల్ అంటే?.. 43 అంగుళాల‌ సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్

సమాజానికి తిరిగి అందించాలనే లక్ష్యంతో విష్ణు మంచు ఈ మహత్కర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇదే కాకుండా దాదాపు రెండేళ్ల క్రితం తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను విష్ణు మంచు దత్తత తీసుకున్నారు. వారందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా విష్ణు మంచు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్‌ను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి తన గొప్ప మనసును చాటుకున్నారు.