Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీ మరో అరుదైన రికార్డ్.. సచిన్ను దాటేసిన రన్ మిషన్

Kohli

Kohli

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లి.. ఈ ఘనతను సాధించాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్.. పొగడ్తల జల్లు కురిపించిన పాక్ మాజీ క్రికెటర్

ఇదిలా ఉంటే రన్ మిషన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కుపైగా పరుగులు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆ రికార్డ్ ను చెరిపేశాడు. ఇదిలా ఉంటే.. సచిన్‌ తన వన్డే కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1000కు పైగా పరుగులు నమోదు చేశాడు.

Rajasthan: ఎన్నికల ముందు కాంగ్రెస్ చీఫ్ కుమారుడికి ఈడీ సమన్లు..

మొత్తంగా ఇప్పటివరకు 288 వన్డేలు ఆడిన విరాట్‌.. 58.19 సగటుతో 13499 పరుగులు సాధించాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో 48 సెంచరీలు, 70 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి మరో సెంచరీ చేస్తే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ రికార్డును సమం చేస్తాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో సెంచరీ చేసి సచిన్ రికార్డ్ బద్దలు చేస్తాడనుకుంటే.. కోహ్లీ 88 పరుగుల వద్ద ఔటై, మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ సెంచరీ సాధిస్తాడని ఎంతో ఆశతో ఉన్న విరాట్ అభిమానులకు నిరాశ ఎదురైంది.

Exit mobile version