Site icon NTV Telugu

Roger Binny: పాక్‌పై కోహ్లీ ఇన్నింగ్స్ కలలా అనిపించింది.. ప్రశంసలు కురిపించిన బిన్నీ

Roger Binny

Roger Binny

Roger Binny: టీ-20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. సీనియర్లందరూ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా విరాట్‌ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ప్రశంసలు కురిపించారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్‌ ఒక కలలాంటిదని, ప్రేక్షకులకు ఒక ట్రీట్‌ వంటిదని అన్నారు. కోహ్లీ ఒక అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడారని ఆయన కొనియాడారు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ తనకు ఒక కలలా ఉందని.. మైదానంలో నలుమూలలకు బంతిని తరలించాడని చెప్పారు.

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం

కోహ్లీ వంటి క్రీడాకారులు ఒత్తిడిలో మరింత మెరుగైన ఆటతీరును కనబరుస్తారని ఆయన అన్నారు. పాక్‌పై సాధించింది ఓ గొప్ప విజయమని తెలిపారు. మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందేమో అనే భావనకు అందరూ వచ్చిన సమయంలో… ఒక్కసారిగా భారత్ చేతుల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించిందని అన్నారు. మ్యాచ్‌లో ఇండియా గెలిచిన తీరును అందరూ అభినందిస్తున్నారని రోజర్‌ బిన్నీ చెప్పారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు తాను ఎంతో రుణపడి ఉన్నానని రోజర్ బిన్నీ అన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తాను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు సేవ చేసినట్లు పేర్కొన్నారు.1973లో అండర్ 19 ఆడినప్పటి నుంచి ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేంత వరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌తో తనకు అనుబంధం ఉందన్నారు.

Exit mobile version