Roger Binny: పాక్‌పై కోహ్లీ ఇన్నింగ్స్ కలలా అనిపించింది.. ప్రశంసలు కురిపించిన బిన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roger Binny: టీ-20 వరల్డ్‌కప్ సూపర్-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. సీనియర్లందరూ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసలు కురిపించారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్ ఒక కలలాంటిదని, ప్రేక్షకులకు ఒక ట్రీట్ వంటిదని అన్నారు. కోహ్లీ ఒక అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడారని ఆయన కొనియాడారు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్ తనకు ఒక కలలా ఉందని.. మైదానంలో నలుమూలలకు బంతిని తరలించాడని చెప్పారు.
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం
Also Read
కోహ్లీ వంటి క్రీడాకారులు ఒత్తిడిలో మరింత మెరుగైన ఆటతీరును కనబరుస్తారని ఆయన అన్నారు. పాక్‌పై సాధించింది ఓ గొప్ప విజయమని తెలిపారు. మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందేమో అనే భావనకు అందరూ వచ్చిన సమయంలో… ఒక్కసారిగా భారత్ చేతుల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించిందని అన్నారు. మ్యాచ్‌లో ఇండియా గెలిచిన తీరును అందరూ అభినందిస్తున్నారని రోజర్ బిన్నీ చెప్పారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు తాను ఎంతో రుణపడి ఉన్నానని రోజర్ బిన్నీ అన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తాను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు సేవ చేసినట్లు పేర్కొన్నారు.1973లో అండర్ 19 ఆడినప్పటి నుంచి ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేంత వరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌తో తనకు అనుబంధం ఉందన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!