Site icon NTV Telugu

Virat Kohli: మరో సెంచరీ వచ్చేది.. కానీ టాస్ గెలిచాం.. వీడియో వైరల్

Kohli

Kohli

Virat Kohli: విశాఖపట్నంలో డిసెంబర్ 6న భారత జట్టు సౌతాఫ్రికాపై తొమ్మిది వికెట్ల భారీ విజయంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత, టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ ఇంస్టాగ్రామ్ లో ఓ సరదా రీల్ పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ అజేయంగా చేసిన 65 పరుగులపై ఆటపట్టించాడు. ఇప్పటికే రాంచీ, రాయ్‌పూర్‌లో వరుసగా రెండు సెంచరీలు చేయరు కదా.. ఈ మ్యాచ్‌లో కూడా శతకం సాధించే అవకాశం ఉందని అర్ష్‌దీప్ నవ్వుతూ చెప్పాడు. దీనిపై కోహ్లీ కూడా తన స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు. ఇందులో అవును, మనం టాస్ గెలిచాం. లేదంటే నువ్వూ నీ సెంచరీ పూర్తి చేసేవాడివి అంటూ కోహ్లీ చేసిన జోక్ క్షణాల్లో వైరల్ అయ్యింది.

Gun Violence: కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి..!

విశాఖలో సాయంత్రం డ్యూ కారణంగా బౌలర్లకు టార్గెట్‌ను డిఫెండ్ చేయడం దాదాపు అసాధ్యం అయ్యింది. ఫలితంగా భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం 39.5 ఓవర్లలోనే చేధించి సిరీస్‌ను గెలుచుకుంది. రాయ్‌పూర్ రెండో వన్డేలో కూడా ఇదే పరిస్థితుల వలన భారత బౌలర్లు 358 పరుగులను కాపాడలేకపోయారు. ఈ సిరీస్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైనది. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌కు దూరమైన తర్వాత కోహ్లీ బరువు తగ్గినట్టుగా, మరింత స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. మూడు మ్యాచ్‌లలో మొత్తం 302 పరుగులు చేసి.. దాదాపు 150 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీ మ్యాచ్ విజయం ఈ ఫార్మాట్‌లో అతని ఆధిపత్యం కంపరిచింది. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో 300+ పరుగులు సాధించడం కోహ్లీ కెరీర్‌లో ఇదే మొదటి సారి.

Increase Non-Veg Rates: నాన్ వెజ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చికెన్, మటన్ రేట్లు

ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లీ తన మనసు తెరిచి మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఈ మెంటల్ స్పేస్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బ్యాటింగ్‌ను నిజంగా ఆస్వాదిస్తున్న దశ ఇది అని చెప్పాడు. కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో జనవరి 2026లో న్యూజిలాండ్ సిరీస్‌తో తిరిగి కనిపించనున్నాడు. అప్పటి వరకు ఫామ్‌ను కొనసాగించేందుకు ఢిల్లీ కోసం విజయ్ హజారే ట్రోఫీలో ఆడతాడు.

Exit mobile version