Ravichandran Ashwin: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ చుట్టూ జరిగిన పరిణామాలను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు. 2025లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కొద్ది రోజుల ముందు కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరి టెస్ట్ మ్యాచ్ 2025 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగింది. కోహ్లీ ఇప్పటికీ వన్డేలలో చురుకుగా ఉన్నప్పటికీ, టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలా వద్దా అనే దానిపై చాలా చర్చ జరిగిందనే అంశాన్ని అశ్విన్ వివరించాడు. ఇది అంత సులభమైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు. విరాట్‌లో ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ.. జట్టు కోసమే రిటైర్మెంట్ ప్రకటించినట్లు అర్థం వచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు.
READ MORE: Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’
Also Read
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
- Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
ఈ అంశంపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్ ఈ రిటైర్మెంట్ అనంతరం కోహ్లీతో తాను చేసిన వ్యక్తిగత సంభాషణను బయటపెట్టాడు. “కోహ్లీలో ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉందని నేను చెప్పాను.. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ ఇంకా రాణించాల్సి ఉంది. అతను రిటైర్ అయ్యాడు. అయితే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే విరాట్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్ళీ రావడం అనేది అంత సులభమైన నిర్ణయం కాదు. భారత్‌లో ఆటగాళ్ల పట్ల ఉండే అవగాహన (Perception) ఇలాంటి నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. సరే.. ఇక విరాట్ రిటైర్ అయ్యాడు. కానీ.. కోహ్లీ విలువ, సూత్రాల పరంగా చూస్తే ఎప్పుడూ జట్టుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లలోనూ జట్టు చాలా ముఖ్యమని, మనం తప్పక గెలవాలని ఎప్పుడూ చెప్పేవాడు. ఇవన్నీ చెప్పిన వ్యక్తి, ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ తిరిగి రావాలని నిర్ణయించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ అతనిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.” అని అశ్విన్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!