Virat Kohli Retirement: రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ!
- అంతర్జాతీయ టీ20లకు విరాట్ కోహ్లీ వీడ్కోలు
- వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు
- రిటైర్మెంట్పై ఊహాగానాలకు విరాట్ చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కింగ్ టెస్ట్, వన్డేలు ఆడుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విరాట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్పటినుంచి అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటికీ విరాట్ తాజాగా చెక్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 వరకూ తాను ఆడతానని సంకేతాలు ఇచ్చాడు.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా విరాట్ సమాధానం ఇచ్చాడు. మీ నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటి? అని హోస్ట్ అడగ్గా.. ‘నా నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటో తెలియదు కానీ.. వన్డే ప్రపంచకప్ 2027 గెలవడానికి ప్రయత్నిస్తా’ అని విరాట్ బదులిచ్చాడు. తన తదుపరి లక్ష్యం వన్డే ప్రపంచకప్ 2027 అని కోహ్లీ చెప్పాడు. అంటే 2027 వరకు ఆటలో విరాట్ కొనసాగాలనుకుంటున్నాడు. విషయం తెల్సిన విరాట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం తేలిపోయింది. మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ 765 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచాడు. అయితే భారత్ ఓడిపోవడంతో కోహ్లీకి నిరాశ తప్పలేదు. వన్డే ప్రపంచకప్ 2027 దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. ఈ టోర్నీ గెలిచి తన లక్ష్యంను నెరవేర్చుకోవాలని కింగ్ చూస్తున్నాడు.
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..