Virat Kohli Injury: ముఖం మొత్తం కమిలింది.. విరాట్ కోహ్లీకి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Instagram Story Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ ఉన్న ఫొటోను విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఫొటోలో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకోగా.. ఎడమ కన్ను కమిలిపోయి ఉంది. అంతేకాదు కుడి చెంప, ఎడమవైపు నుదురు భాగంలో చిన్న గాయం ఉంది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫొటో చూసిన అందరూ విరాట్ కోహ్లీకి ఏమైంది? అని కంగారుపడ్డారు. అయితే ఆ ఫొటోకు ‘మీరు మరొక వ్యక్తిని చూస్తారు’ అని క్యాప్షన్ రాశాడు. దాంతో ఆ ఫొటో మార్ఫింగ్ అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విరాట్ ఆడడం లేదు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ 2023లో కోహ్లీ 765 పరుగులు చేశాడు. అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా దక్కింది.
Also Read
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
Also Read: Hasan Ali-IPL: ఐపీఎల్ ఆడాలనేది నా కోరిక: పాక్ పేసర్
ఐపీఎల్ 2024 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని అట్టిపెట్టుకుంది. 16వ సీజన్‌లో కోహ్లీ అలరించాడు. వరుసగా రెండు శతకాలు చేసిన విరాట్.. బెంగళూరు ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ఎంతో కష్టపడ్డాడు. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ గెలవడంతో బెంగళూరు ఇంటిదారి పట్టింది. ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ చేరిన బెంగళూరు.. ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. ఐపీఎల్ 2024లో కప్ కొట్టాలని కోహ్లీ భావిస్తున్నాడు.
What’s Virat Kohli upto?
King Kohli latest Instagram story. pic.twitter.com/EE6C00FuyU— Mufa (@MufaKohlii) November 27, 2023
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!