Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి ఐపీఎల్ 2026 ఫైనల్ లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం తన సరదా చేష్టలతో అందరి దృష్టిని మరోసారి వార్తల్లో నిలిచాడు.
మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు బౌండరీ లైన్ దగ్గర అధికారిక జట్టు ఫోటోషూట్, మీడియా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అప్పటికే మ్యాచ్ కు సిద్ధమై ప్యాడ్లు కట్టుకున్న కోహ్లీ, బ్యాక్ గ్రౌండ్లో నిలబడి గుజరాత్ ఆటగాళ్ల వైపు ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సరదాగా కనిపించాడు. కోహ్లీ చేసిన ఆ సరదా చేష్టలను కెమెరాలు వెంటనే క్యాచ్ చేయగా.. స్టేడియంలో ఉన్న అభిమానులు తెగ ఎంజాయ్ చేసారు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై మిశ్రమ స్పందన వెల్లడవుతుంది.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
కొందరు అభిమానులు “ఇదే అసలైన విరాట్ ఎంటర్టైన్మెంట్” అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం విభిన్నంగా “నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ” అంటూ మండి పడుతున్నారు. నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి ఉన్నప్పటికీ కోహ్లీ చాలా రిలాక్స్డ్ గా కనిపించాడు. మ్యాచ్‌కు ముందు టెన్షన్ వాతావరణాన్ని తన సరదా చేష్టలతో కాస్త లైట్ చేశాడు. మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో, బయట అంతే ఉత్సాహంగా ఉంటాడని మరోసారి నిరూపించాడు. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 43 పరుగులు చేసి కీలక పాత్ర పోషించి.. వరుసగా 4వ సీజన్లో 600+ పరుగులు పూర్తి చేశాడు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!