Site icon NTV Telugu

Virat kohli : ఐపీఎల్ నియమాలు ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీకి జరిమానా

Virat Kohli

Virat Kohli

Virat kohli : ఐపిఎల్‌లో సోమవారం (ఏప్రిల్ 17) రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించబడింది. మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనికి జరిమానా విధించారు. కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు.

Read Also: Monkey : బావిలో పడిన పిల్లిని కాపాడిన కోతి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించినట్లు ఐపిఎల్ ప్రకటన పేర్కొంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లోని లెవల్-1 కేటగిరీల కింద కూడా కోహ్లీ తన తప్పును అంగీకరించాడు. ఇందులో ఆటగాడి దుస్తులకు, ప్రత్యర్థి జట్టుతో, అంపైర్‌తో ప్రవర్తనకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి.

Read Also: Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్

CSK చేతిలో RCB ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన RCB జట్టు నిర్ణీత ఓవర్లకు 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక్కడ విరాట్ కోహ్లీ కేవలం నాలుగు బంతులు ఆడిన తర్వాత పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతను 6 పరుగుల వద్ద ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Exit mobile version