Monkey : ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా తనలోని మానవత్వాన్ని గుర్తుంచుకుని సాయం చేసేందుకు ముందుకొస్తారు. అయితే నేటి సమాజంలో మానవత్వంతో సాయం చేసే వాళ్లు కరువయ్యారు. ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తే వీడియో తీయడమో, లేదా పట్టించుకోకుండా వదిలేసి వెళ్లడమో చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అలాంటి మానవత్వం మనుషుల్లోనే కాదు కొన్ని జంతువులలో కూడా కనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన చాలా మంది ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు.
Read Also: Ramakrishna: హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో బావిలో పడిన పిల్లిని కోతి రక్షించడం కనిపిస్తుంది. ఆ వీడియోలో కనిపిస్తున్న కోతి అటూ ఇటూ తిరుగుతుండగా అకస్మాత్తుగా బావి దగ్గరికి చేరుకోగా పిల్లి బావిలో పడి పోవడం కోతి చూస్తుంది. బావిలో పడిన పిల్లికి బయటపడుతానన్న ఆశ లేదు. కానీ అటుగా వచ్చిన కోతి పిల్లి పరిస్థితి బావిలోకి దూకింది. ఆ బావిలో ఎక్కువ నీరు లేదు బురద ఉంది. కాబట్టి ఆ బావిలో అవి రెండూ మునిగిపోయే అవకాశం లేదు. కోతి పిల్లిని బావిలో నుండి పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఎంత ప్రయత్నించినప్పటికీ దానిని బయటకు తీయలేకపోతుంది. చివరకు ఒక మహిళ వచ్చి పిల్లిని బయటకు లాగింది. ఈ పిల్లిపై కోతి చూపిన దయ, ప్రేమ కారణంగా ఈ వీడియో చాలా మందికి షేర్ చేయబడింది. ఈ వీడియోను @TansuYegen అనే ID ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఒక నిమిషం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను 6 లక్షల 45 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఉద్వేగానికి గురిచేసిందంటున్నారు.
Witness the most heartwarming monkey rescue ever! 🐵❤️ pic.twitter.com/IaRgWUzwUz
— Tansu YEĞEN (@TansuYegen) April 16, 2023