Virat Kohli reached another elite milestone in WI vs IND 1st Test: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ టెస్టులో తన శైలికి బిన్నంగా విరాట్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశాడు. తొలి బౌండరీ బాదడానికి ఏకంగా 81 బంతులు తీసుకున్నాడు. చివరకు టెస్టుల్లో 29వ అర్ధ శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో కింగ్ కోహ్లీ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో మూడో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 2012 నాగ్‌పూర్ టెస్టులో 171 బంతుల్లో అర్ధ శతకం బాదిన కోహ్లీ.. 2022లో దక్షిణాఫ్రికాపై 159 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో 147 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
Also Read: MS Dhoni-Yogi Babu: అరె ఏంటన్నా ఇది.. అలా తినేశావ్! ఎంఎస్ ధోనీ, యోగి బాబు వీడియో వైరల్
విదేశాల్లో అత్యధికసార్లు 50 ప్లస్ రన్స్ చేసిన రెండో భారత ఆటగాడిగా విరాట్ కొహ్లీ నిలిచాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 88 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (87)పేరిట ఉండేది. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (96) అగ్రస్ధానంలో ఉన్నాడు. టెస్టుల్లో విదేశాల్లో కోహ్లీకి ఇది 31వ 50 ప్లస్ స్కోరు.
భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10112), వీవీఎస్ లక్ష్మణ్ (8781) తర్వాత విరాట్ కోహ్లీ (8555) ఉన్నాడు. తాజాగా వీరేందర్ సెహ్వాగ్ (8503)ను విరాట్ అధిగమించాడు.
Also Read: Constipation Remedies: మలబద్ధకం సమస్యతో పడుతున్నారా?.. ఉదయాన్నే ఈ పనులు చేయండి!
Virat Kohli has 2nd most 50+ scores in overseas by an Indian.
The GOAT. pic.twitter.com/as82nvg5Y0
— Johns. (@CricCrazyJohns) July 14, 2023
