NTV Telugu Site icon

Virat Kohli Century: విదేశాల్లో 15 సెంచరీలు చేశా.. అదేమీ చెత్త రికార్డు కాదు: విరాట్ కోహ్లీ

Virat Kohli Interview

Virat Kohli Interview

Virat Kohli Slams at Criticism Over 5 Year Overseas Century Drought: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ (76) చేసిన కోహ్లీ.. రెండో టెస్టులో సెంచరీ (121) బాదాడు. ఇది కోహ్లీకి టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ. మొత్తంగా 76వ శతకం. ఇక కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. ఇక విదేశాల్లో చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన కోహ్లీ.. నాలుగున్నర ఏళ్ల తర్వాత విండీస్‌పై శతకొట్టాడు. ఈ విషయంపై రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

‘నేను ఎలా ఆడాలని కోరుకున్నానో అలానే బ్యాటింగ్‌ చేశా. చాలా సంతోషంగా ఉంది. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ జట్టు కోసం పరుగులు చేసేందుకు సిద్ధంగా ఉంటా. నాతో నేను పోటీ పడుతూ.. అత్యుత్తమ ఆట ఆడేందుకు ప్రయత్నిస్తా. వెస్టిండీస్‌ బౌలర్లు మంచి ప్రదేశంలో బంతులను సంధించడంతో స్లోగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ట్రినిడాడ్‌ పిచ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. ఔట్‌ ఫీల్డ్‌ కూడా గొప్పగా లేదు. అందుకే మంచి షాట్లు కొట్టినా బౌండరీలు రాలేదు’ అని విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.

Also Read: Baby Movie Remuneration: బేబీ సినిమా హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్‌ ఇంత తక్కువా?

‘దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత సెంచరీ చేశా అని అంటున్నారు. అందరూ మాట్లాడుకోవడానికి మాత్రమే ఇది బాగుంటుంది. విదేశాల్లో నేను 15 సెంచరీలు చేశా, అదేమీ చెత్త రికార్డు కాదు. సొంతగడ్డపై కంటే బయటే ఎక్కువ సెంచరీలు చేశా. ఈ ఐదు ఏళ్లలో బయట ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే హాఫ్‌ సెంచరీలు చేశాను. జట్టు కోసం నా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధం. మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసి ఔటైతే.. 100 మిస్‌ అయిందని బాధపడతా. 120కి పైగా పరుగులు చేసి ఔట్ అయితే డబుల్‌ సెంచరీ మిస్‌ అయిందని భావిస్తా. 15 నా కెరీర్‌లో ఎన్నో గణాంకాలు, మైలురాళ్లను చూశా. అయితే నా ప్రదర్శన జట్టుపై ప్రభావం చూపిందా? లేదా? అనేది నాకు ముఖ్యం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

‘భారత్‌ తరఫున 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం గర్వంగా ఉంది. ఆట పట్ల చూపించే దృక్పథం కారణంగానే ఇది సాధ్యమైందని భావిస్తా. అన్ని ఫార్మాట్లలో ఆడగల సత్తా ఉంది. ఒక ఫార్మాట్‌ నుంచి మరొక ఫార్మాట్‌కు త్వరగా మారిపోతా. ఫిట్‌నెస్‌ వల్లే ఇదంతా సాధ్యం. విండీస్‌తో వందో టెస్టులో ఆడటం సంతోషంగా ఉంది. ఇక్కడి వారు క్రికెట్‌ను బాగా అభిమానిస్తారు. ట్రినిడాడ్‌, అటింగ్వా మైదానం నాకెంతో ఇష్టం. ఆసీస్‌లో అడిలైడ్, దక్షిణాఫ్రికాలో బుల్‌రింగ్‌ పిచ్‌పై ఆడటం ఇష్టమే అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు!