NTV Telugu Site icon

Virat Kohli Recod: విరాట్ కోహ్లీ సరికొత్త.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!

Virat Kohli Batting Shot

Virat Kohli Batting Shot

Virat Kohli Becomes 1st Batter to scored most runs in ICC World Cups: టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజింగ్ మాస్టర్ ‘విరాట్ కోహ్లీ’ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐసీసీ క్రికెట్ టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు 67 మ్యాచ్‌లు ఆడి.. 2311 పరుగులు చేశాడు.

ఐసీసీ టోర్నీల్లో సచిన్ టెండూల్కర్ 61 మ్యాచ్‌లు ఆడి.. 2278 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (2193) మూడో స్థానంలో స్థానాల్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2011 ప్రపంచకప్‌లో మొదటిసారి ఆడాడు. 9 ఇన్నింగ్స్‌లలో 282 పరుగులు చేశాడు. మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ (100 నాటౌట్‌) చేశాడు.

Also Read: Shubman Gill: అహ్మదాబాద్‌లో శుభ్‌మన్‌ గిల్‌.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో..!

విరాట్ కోహ్లీ ఐదు టీ20 ప్రపంచకప్‌లలో ఆడాడు. 25 ఇన్నింగ్స్‌లలో 14 అర్ధ శతకాలు, 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడు కోహ్లీ. విరాట్ వన్డే ప్రపంచకప్‌లలో 1170 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో బెస్ట్ యావరేజ్ కలిగిన ప్లేయర్ కూడా కోహ్లీనే. అంతేకాదు మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీలో 50కి పైగా యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్ కోహ్లీనే కావడం విశేషం.