Virat Kohli Recod: విరాట్ కోహ్లీ సరికొత్త.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Becomes 1st Batter to scored most runs in ICC World Cups: టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజింగ్ మాస్టర్ ‘విరాట్ కోహ్లీ’ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐసీసీ క్రికెట్ టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు 67 మ్యాచ్‌లు ఆడి.. 2311 పరుగులు చేశాడు.
ఐసీసీ టోర్నీల్లో సచిన్ టెండూల్కర్ 61 మ్యాచ్‌లు ఆడి.. 2278 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (2193) మూడో స్థానంలో స్థానాల్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2011 ప్రపంచకప్‌లో మొదటిసారి ఆడాడు. 9 ఇన్నింగ్స్‌లలో 282 పరుగులు చేశాడు. మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ (100 నాటౌట్) చేశాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
Also Read: Shubman Gill: అహ్మదాబాద్‌లో శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో..!
విరాట్ కోహ్లీ ఐదు టీ20 ప్రపంచకప్‌లలో ఆడాడు. 25 ఇన్నింగ్స్‌లలో 14 అర్ధ శతకాలు, 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడు కోహ్లీ. విరాట్ వన్డే ప్రపంచకప్‌లలో 1170 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో బెస్ట్ యావరేజ్ కలిగిన ప్లేయర్ కూడా కోహ్లీనే. అంతేకాదు మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీలో 50కి పైగా యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్ కోహ్లీనే కావడం విశేషం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..