NTV Telugu Site icon

Virat Kohli Birthday: కోల్‌కతాలో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌.. 70 వేల విరాట్ కోహ్లీ ఫేస్‌ మాస్క్‌లు సిద్ధం!

Kohli

Kohli

CAB to distribute 70000 Virat Kohli Masks to Fans during IND vs SA Match : ప్రపంచకప్‌ 2023లో భాగంగా నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నవంబర్ 5న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. కింగ్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దీంతో బర్త్‌ డే రోజు విరాట్ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఈడెన్‌ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించేందుకు బెంగాల్‌ క్రికెట్ సంఘం (క్యాబ్) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం సామర్థ్యం 68 వేలు. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా.. మైదానంకు వచ్చే ప్రతి అభిమాని కింగ్ ఫేస్‌ మాస్క్‌ను ధరించేలా 70 వేల ఫేస్‌ మాస్క్‌లను అందుబాటులో ఉంచాలని క్యాబ్‌ ప్లాన్‌ చేస్తోందట. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ చూసేందుకు వచ్చే ప్రతి అభిమానికి క్యాబ్ ఓ ఫేస్‌ మాస్క్‌ను ఫ్రీగా ఇవ్వనుంది. అంతేకాదు మ్యాచ్‌ ముగిసిన అనంతరం కింగ్ కోహ్లీతో బౌండరీ లైన్‌ వద్ద కేక్ కటింగ్‌ కూడా ప్లాన్ చేసిందట. కేక్ కటింగ్‌ అనంతరం కోహ్లీకి ఓ బహుమతి కూడా అందజేయాలని క్యాబ్ ప్లాన్ చేసిందని సమాచారం.

Also Read: AFG vs SL: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ విజయం.. స్టూడియోలో చిందులేసిన భారత మాజీలు!

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకావాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను క్యాబ్‌ ఆహ్వానించింది. అందుకు ఆయన అంగీకరించినట్లు క్యాబ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్స్ అన్ని హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. విరాట్ కోహ్లీ పుట్టినరోజు కావడం, పటిష్ట దక్షిణాఫ్రికా టీం కాబట్టి టికెట్స్ కోసం ఫాన్స్ ఎగబడ్డారు. ప్రపంచకప్‌ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

 

 

Show comments