AFG vs SL: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ విజయం.. స్టూడియోలో చిందులేసిన భారత మాజీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irfan Pathan and Harbhajan Singh Dance Video Goes Viral after AFG bet SL: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పసికూన అఫ్గానిస్తాన్ మూడో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ విన్నర్ పాకిస్తాన్ జట్లను ఓడించిన అఫ్గాన్.. తాజాగా మాజీ వరల్డ్ ఛాంపియన్ శ్రీలంకకు భారీ షాక్ ఇచ్చింది. పూణేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆపై అఫ్గాన్ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది.
శ్రీలంకను అఫ్గానిస్తాన్ చిత్తు చేసిన అనంతరం భారత మాజీలు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ స్టూడియోలో భాంగ్రా డాన్స్ చేశారు. ముందుగా ఇర్ఫాన్ డాన్స్ చేయగా.. ఆపై అతడికి హర్భజన్ జత కలిశాడు. ఇద్దరు కలిసి అఫ్గానిస్తాన్ సంచలన విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఇర్ఫాన్, హర్భజన్‌ల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు పాకిస్థాన్‌పై అఫ్గాన్ విజయం సాధించిన తర్వాత ఇర్ఫాన్ ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: Afghanistan Cricket: అఫ్గానిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ ఆస్ట్రేలియా.. ఓడిస్తే సెమీస్‌కు..!
అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు భారత్‌తో అనుబంధం ఉంది. అఫ్గాన్ క్రికెట్‌ను మెరుగుపరచడంలో, క్రికెటర్లను తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. అఫ్గాన్ జట్టుకు భారత మాజీ ప్లేయర్ అజయ్ జడేజా మెంటార్‌గా ఉన్నాడు. జడేజా మార్గనిర్ధేశంలో అఫ్గాన్ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. అందుకే ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అజయ్ జడేజాను భారత క్రికెట్‌లో గురు జీ అని పిలుస్తుంటారు. ఇక అఫ్గాన్ తన తదుపరి మూడు మ్యాచ్‌లలో గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో అఫ్గానిస్తాన్ తలపడాల్సి ఉంది.
Afgan win and #irfan dance is must#AFGvsL #Afghanistan #CricketTwitter #Cricket #NoOilForIsrael #BabarAzamIsMyCaptian #dagestan #Gaza_Genicide pic.twitter.com/cqmuefStFq
— Professionalsportsfans (@PROFSPOFANS) October 30, 2023
Afghanistan playing some brand of cricket 🔥🔥 this celebration….#AFGvsL #SLvsAFGpic.twitter.com/bgYR2w9f9M
— Iron Ore ( लौह अयस्क ) (@InUrDreaMsdian) October 30, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..