NTV Telugu Site icon

Naveen Ul Haq-Virat Kohli: ప్లీజ్.. ట్రోల్ చేయొద్దు! కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్

Naveen Ul Haq Virat Kohli

Naveen Ul Haq Virat Kohli

Virat Kohli Says Don’t Troll Naveen Ul Haq in IND vs AFG Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్‌ మధ్య గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ సందర్భంగా నవీన్, కోహ్లీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడమే ఈ గొడవకు కారణమైంది. అది కాస్త పెను దుమారంగా మారింది. ఇందులో మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా తలదూర్చాడు. దాంతో గొడవ మరింత పెద్దదైంది.

అసలు ఏమైందంటే.. విరాట్ కోహ్లీ పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్‌ అంపైర్లకు ఫిర్యాదు చేసాడు. తాను పిచ్‌పైకి వెళ్లలేదని, తన షూస్‌కు ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్‌కు కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నవీన్‌కు విరాట్ కాలు చూపించాడని అందరూ పొరబడ్డారు. గౌతమ్ గంభీర్ కూడా ఇలానే పొరపడి.. కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ ఏదో సూచనలు చేయబోగా.. నవీన్ ఘాటుగా స్పందించాడు. దాంతో గొడవ పెద్దదైంది. ఈ గొడవను కోహ్లీ విడిచిపెట్టినా.. నవీన్ వదిలేయలేదు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీ ఔటవ్వగా.. ‘స్వీట్ మ్యాంగోస్’ అని ట్వీట్ చేశాడు. అది కోహ్లీ అభిమానులకు నచ్చలేదు. అప్పటినుంచి నవీన్‌ను అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్‌ 2203లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ యువ పేసర్‌ నవీన్ ఉల్ హక్‌కు విరాట్ కోహ్లీ ఫాన్స్ చుక్కలు చూపించారు. విరాట్ క్రీజులోకి అడుగుపెట్టగానే కోహ్లీ నామస్మరణంతో స్డేడియం దద్దరిళ్లిపోయింది. ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరుస్తూ నవీన్‌ను ట్రోల్ చేశారు. నవీన్‌ ఫీల్డింగ్ సమయంలో, బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫాన్స్ తెగ ఇబ్బంది పెట్టారు. ఇది గమనించిన కోహ్లీ.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. నవీన్‌ను ట్రోల్ చేయవద్దని తన సైగలతో అభిమానులను కోరాడు. కోహ్లీ సూచనలతో ఫాన్స్ సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ చేసిన పనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Also Read: Virat Kohli Recod: విరాట్ కోహ్లీ సరికొత్త.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!

విరాట్ కోహ్లీ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. వన్డే ప్రపంచకప్‌ 2019లోనూ స్టీవ్ స్మిత్‌ను ‘ఛీటర్ ఛీటర్’ అంటూ అభిమానులు ఎగతాళి చేసినప్పుడు ‘అలా అనొద్దని’ అభిమానులను కోరాడు. ఇక భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్‌ తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడి హగ్ చేసుకున్నాడు. కోహ్లీ నవ్వుతూ అతన్ని హగ్ చేసుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవకు ఎండ్ కార్డు పడింది.

Show comments