Naveen Ul Haq-Virat Kohli: ప్లీజ్.. ట్రోల్ చేయొద్దు! కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Says Don’t Troll Naveen Ul Haq in IND vs AFG Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా నవీన్, కోహ్లీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడమే ఈ గొడవకు కారణమైంది. అది కాస్త పెను దుమారంగా మారింది. ఇందులో మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా తలదూర్చాడు. దాంతో గొడవ మరింత పెద్దదైంది.
అసలు ఏమైందంటే.. విరాట్ కోహ్లీ పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేసాడు. తాను పిచ్‌పైకి వెళ్లలేదని, తన షూస్‌కు ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్‌కు కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నవీన్‌కు విరాట్ కాలు చూపించాడని అందరూ పొరబడ్డారు. గౌతమ్ గంభీర్ కూడా ఇలానే పొరపడి.. కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ ఏదో సూచనలు చేయబోగా.. నవీన్ ఘాటుగా స్పందించాడు. దాంతో గొడవ పెద్దదైంది. ఈ గొడవను కోహ్లీ విడిచిపెట్టినా.. నవీన్ వదిలేయలేదు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీ ఔటవ్వగా.. ‘స్వీట్ మ్యాంగోస్’ అని ట్వీట్ చేశాడు. అది కోహ్లీ అభిమానులకు నచ్చలేదు. అప్పటినుంచి నవీన్‌ను అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
వన్డే ప్రపంచకప్ 2203లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు విరాట్ కోహ్లీ ఫాన్స్ చుక్కలు చూపించారు. విరాట్ క్రీజులోకి అడుగుపెట్టగానే కోహ్లీ నామస్మరణంతో స్డేడియం దద్దరిళ్లిపోయింది. ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరుస్తూ నవీన్‌ను ట్రోల్ చేశారు. నవీన్ ఫీల్డింగ్ సమయంలో, బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫాన్స్ తెగ ఇబ్బంది పెట్టారు. ఇది గమనించిన కోహ్లీ.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. నవీన్‌ను ట్రోల్ చేయవద్దని తన సైగలతో అభిమానులను కోరాడు. కోహ్లీ సూచనలతో ఫాన్స్ సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ చేసిన పనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read: Virat Kohli Recod: విరాట్ కోహ్లీ సరికొత్త.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
విరాట్ కోహ్లీ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. వన్డే ప్రపంచకప్ 2019లోనూ స్టీవ్ స్మిత్‌ను ‘ఛీటర్ ఛీటర్’ అంటూ అభిమానులు ఎగతాళి చేసినప్పుడు ‘అలా అనొద్దని’ అభిమానులను కోరాడు. ఇక భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్ తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడి హగ్ చేసుకున్నాడు. కోహ్లీ నవ్వుతూ అతన్ని హగ్ చేసుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవకు ఎండ్ కార్డు పడింది.
Virat Kohli asking the Delhi crowd to stop mocking Naveen Ul Haq.pic.twitter.com/Dq482rPsFU
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023
తాజావార్తలు
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!