NTV Telugu Site icon

Virat Kohli: కుటుంబం మొత్తంతో సాధువును కలిసిన విరాట్.. వీడియో వైరల్

Virat

Virat

Virat Kohli: క్రికెట్ లో గొప్ప గొప్ప విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ ఎంత సక్సెస్ ఫుల్ ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అయితే, ఎంత గొప్ప ఆటగాడైన అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం పరిపాటే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఆ పరిస్థితులలో ఉన్నాడు. ఇకపోతే తాజాగా కోహ్లీ అతని భార్య అనుష్క శర్మతో కలిసి మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్ ను కలవడానికి బృందావన్ వెళ్లారు. గతంలో కూడా కోహ్లీ తన ఫామ్ లో లేని సమయంలో ప్రేమానంద్ మహారాజ్‌ను కలిశారు. ఇప్పుడు కోహ్లీ తన ఇద్దరి పిల్లలతో సహా కుటుంబం మొత్తం మహారాజ్‌ను కలవడం చర్చనీయాంశమైంది.

Also Read: Costly Catch: ఒంటి చేత్తో క్యాచ్ పట్టి.. రూ.90 లక్షలు పట్టుకెళ్లిన ప్రేక్షకుడు

ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్క దంపతులు సాధువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కలిసి పలు మతపరమైన యాత్రలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా బాబా నీమ్ కరౌలీ కైంచి ధామ్కు కూడా అప్పట్లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇక విరాట్ కోహ్లీ తన ఆటలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రేమానంద్ మహారాజ్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి, విరాట్, అనుష్క జంట ప్రేమానంద్ మహారాజ్ వద్దకు వెళ్లి, తనకున్న ప్రశ్నలకు సమాధానాలు కోరారు.

Also Read: Devendra Fadnavis: “రాజ్ ఠాక్రే స్నేహితుడు, ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు”.. ఫడ్నవీస్ కామెంట్స్..

ఆరోగ్య, యోగక్షేమాలపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “చివరిసారి వచ్చినప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని.. ఇప్పుడు అవి అడగాలని అనుకున్నానని అన్నారు. కానీ, అక్కడ ఉన్న ప్రతివారూ ఈ ప్రశ్నను అడిగారు. కాబట్టి నేను ప్రేమ, భక్తి మాత్రమే కోరుతున్నాను” అని చెప్పినట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన ప్రతిష్ఠాత్మక ఫామ్‌ను కోల్పోయి, ఐదు మ్యాచుల్లో కేవలం 190 పరుగులే సాధించాడు. ఇందులో ఒకే ఒక్క సెంచరీ మాత్రమే చేయగలిగాడు.

Show comments