Site icon NTV Telugu

Hijra’s Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం.. వసూళ్ల విషయంలో ఘర్షణ

Hijraza

Hijraza

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించగా.. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం పీఎస్ కు వచ్చింది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో పోలీస్ స్టేషన్ లోనే తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

Read Also: Kethireddy Pedda Reddy: జేసీ ప్రభాకర్‌కి కేతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఇక, పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు కొట్టుకున్నారు. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.. దీంతో ఏం చేయాలో అర్థంకాక పోలీసులు వారి గొడవను చూస్తు ఉండిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్రాలు తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. వసూళ్ల విషయంలోనే ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తుంది. దీంతో రెండు వర్గాల హిజ్రాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక.. ఈ రెండు వర్గాల హిజ్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Read Also: Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం

అయితే.. రెండు వర్గాల కు చెందిన హిజ్రాలు వసూళ్లు చేసుకునే విషయంలో ఈ గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. తమ పరిధిలోకి మరో వర్గం వచ్చి వసూళ్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మరో వర్గం హిజ్రాలు అలాంటిదేమి లేదని.. కావాలనే తమపై కక్షపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇంకొ వర్గం హిజ్రాలు అంటున్నారు.

Exit mobile version