Site icon NTV Telugu

Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం.. ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ..

Tesla Crash China

Tesla Crash China

Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో అదుపు తప్పి ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వాహ‌న‌దారుడితో పాటు స్కూల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇద్దరిపైనుంచి దూసుకుపోయింది. ఈ ఘ‌ట‌న న‌వంబ‌ర్ 5వ తేదీన ద‌క్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాన్‌లో చోటు చేసుకుంది.

Read Also: Karnataka Cricketer Record: వన్డే క్రికెట్లో సంచలనం.. 165బంతుల్లో 407పరుగులు

ఈ ప్రమాదం నేప‌థ్యంలో టెస్లా కారుపై తీవ్ర విమ‌ర్శలు వెలువెత్తాయి. ఈ ఘ‌ట‌న‌పై చైనా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చైనాలోని టెస్లా కంపెనీ ఏజెన్సీ నుంచి పోలీసులు వివ‌ర‌ణ కోరారు. దీనిపై ఎలాన్ మ‌స్క్ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీదారు మాట్లాడుతూ.. ద‌య‌చేసి ఎలాంటి పుకార్లు న‌మ్మొద్దని త్వరలోనే కారణం తెలుస్తోందన్నారు.

Read Also:Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!

టెస్లా కంపెనీకి చైనా రెండో అతిపెద్ద మార్కెట్.. ఈ ఘటనకు సంబంధించిన ఘోర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కారు వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ లైట్లు ఆన్ అవ్వలేదని, పైగా డ్రైవర్ బ్రేక్ వేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా అనిపించడం లేదని కొందరు అంటున్నారు. డ్రైవర్ బంధువు ఒకరు మాత్రం కారుకు బ్రేకు సమస్య ఉందని తెలిపారు.

Exit mobile version