సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత పెడదారి పడుతోంది. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ.. కొందరు హద్దలు దాటి ప్రవర్తిస్తున్నారు. మొన్నటిదాకా మెట్రో రైళ్లో, పార్కుల్లో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవారు. ఈ పిచ్చి ఇప్పుడు ఎయిర్‌పోర్టులకు చేరింది. ఆ మధ్య ఓ యువతి విమానాశ్రాయంలో ఉండే లగేజీ బెల్టుపై పడుకుని సాహసానికి పూనుకుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కూడా ఓ యువతి రెచ్చిపోయింది. ఆమె ప్రవర్తన ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించింది. కనీస స్పృహ లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Southwest Monsoon: చాలా అరుదు.. కేరళ, ఈశాన్య ప్రాంతాలకు ఒకేసారి రుతుపవనాల రాక..
ముంబై ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో ఓ అమ్మాయి హఠాత్తుగా డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. రద్దీగా ఉందన్న కనీస స్పృహ లేకుండా డ్యాన్స్ చేసింది. ఓ వైపు ప్రయాణికులు బిజిబిజీగా తిరుగుతున్నా.. కనీసం వారిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నృత్యం చేసింది. ఈ ఘటనపై ప్యాసింజర్స్ మండిపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ బాలీవుడ్ పాటకు ఆమె డ్యాన్స్ చేసినట్లు కనిపించింది. కొంతమంది డ్యాన్స్ చూడగా.. మరికొందరు పట్టించుకోలేదు.
ఇది కూడా చదవండి: Prajwal Revanna: జర్మనీలో విమానం ఎక్కిన ప్రజ్వల్ రేవణ్ణ.. సెక్స్ టేపుల కేసులో కీలక పరిణామం..
ఇక ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. యువతిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులను కోరుతున్నారు. ఇలాంటి వారి పట్ల కఠిన చట్టాలు ఉపయోగించి శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులను కూడా తమ సొంత అవసరాలకు వాడేసుకుంటున్నారని మరొకరు ధ్వజమెత్తారు.
The virus has reached the airports pic.twitter.com/vSG15BOAZE
— desi mojito 🇮🇳 (@desimojito) May 29, 2024