Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సామాన్యులకు తక్కువ ఖర్చులో సేఫ్ గా ప్రయాణించే మార్గం కేవలం రైలు మార్గమే. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రైలు ప్రయాణం చేయడానికి సుముఖుత చూపుతారు. అయితే అప్పుడప్పుడు కొందరు వారు చేసే చిన్న తప్పిదాల వల్ల అనేకమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు రైలు ప్రయాణాలలో. మరికొందరు ఆ ప్రమాదాలనుంచి బయట పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బంగ్లాదేశ్ లోని కిషోరేగంజ్ జిల్లాలో గుండెల్లో దడ పుట్టించే ఘటన వెలుగులోకి వచ్చింది. భైరబ్ రైల్వే స్టేషన్ వద్ద ఒక తండ్రి తన ఏడాది వయసున్న చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఏప్రిల్ 28న మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. టిటాస్ కమ్యూటర్ రైలు ఢాకా వైపు వెళ్తున్న సమయంలో.. రైలు ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. కుటుంబం రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించేలోపే రైలు మళ్లీ కదలడం ప్రారంభమైంది.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ క్రమంలో తండ్రి తన చిన్నారిని చేతిలో పట్టుకుని త్వరగా దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ తొందరలో చిన్నారి అతని చేతుల నుంచి జారి రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యనున్న గ్యాప్‌లో పడిపోయింది. ఈ దృశ్యం చూసిన తండ్రి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కిందికి దూకాడు. తన చిన్నారిని గట్టిగా కౌగిలించుకుని ప్లాట్‌ఫామ్ అంచు కింద గోడకు అతుక్కుని పడుకున్నాడు. ఆ సమయంలో రైలు బోగీలు వారి మీదుగా వెళ్లిపోయినా.. అదృష్టవశాత్తూ ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురి చేసింది.
రైలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తండ్రి, చిన్నారి పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారి తల్లి కూడా ట్రాక్ పైకి దిగి తన బిడ్డను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ సురక్షితంగా బయటపడటం అందరికి ఊరట కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, తండ్రి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన రైలు ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.
Kishoreganj, April 28 — A father and his one-year-old son narrowly escaped death after falling into the gap between a moving train and the platform at Bhairab Railway Station.#Kishoreganj #Bhairab #Bangladesh #Train #Father #Baby pic.twitter.com/RLek04dGcf
— The Premium 24 (@ThePremium24X) April 29, 2026
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!