వివాహ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది.. ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అయితే కొన్ని దేశాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి.. అయితే ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకాల వివాహలను మనం చూసే ఉంటాం..అందులో దైవ వివాహం, అర్షవివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం ఇలా ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి..
కొన్ని తెగల వాళ్ళు కొన్ని ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటారు..వివాహం సమయంలో రకరకాల వింత సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తుంటారు. ఏ సాంప్రదాయంలో ఐనా చూపులు చూసో, లేదా ప్రేమ వివాహమో చేసుకుంటారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశంలో పెళ్లిళ్లు మాత్రం ఊహించని విధంగా జరుగుతాయి..అదేంటంటే.. వేరే వాళ్ల భార్యాలను ఎంపిక చేసుకొని వారిని ఎత్తు కెళ్లి.. అదే మన భాషలో కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకొనే సాంప్రదాయం ఉంది.. ఇదేం ఆచారం అనుకుంటున్నారు కదా.. అదే వారికి సాంప్రదాయమట.. ఆ దేశంలో ఆఫ్రికాలో ఉంది..
వివరాల్లోకి వెళితే.. వోడబ్బో తెగలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది. ఆ తెగలోని ప్రజలు వివాహం చేసుకోవాలనుకుంటే వారు ఇతరుల భార్యలను దొంగిలించి వారిని వివాహం చేసుకోవాలి. అలా చేసినప్పటికీ ఆ గ్రామానికి చెందిన వారు ఎవరూ కూడా ఎలాంటి శిక్షలు వేయరట.. మొదటి పెళ్లి మాత్రం తల్లి దండ్రుల ఇష్టం ప్రకారం జరిగితే.. రెండో పెళ్లి మాత్రం వాళ్ల ఇష్టం ప్రకారం జరుగుతుందని అంటున్నారు..ఇక ప్రతి ఏడాది వోడబ్బో తెగ గిరిజనులు గేరెవోలు ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పండగలో అబ్బాయిలు ముఖం నిండా రంగులు పూసుకుని నృత్య ప్రదర్శన చేస్తూ ఇతరుల భార్యను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ విషయం మహిళ భర్తకు తెలియకుండా మహిళలను ఆకర్షించాల్సి ఉంటుందంట. అప్పుడు మహిళ అతడి పట్ల ఆకర్షితురాలై అతనితో వెళ్లిపోవచ్చు.. లేదా మహిళను ఎత్తుకెళ్లి పోతారు.. పెళ్లి చేసుకుంటారు.. ఏంటో ఇలాంటి ఆచారం మన దేశంలో అయితే లేదు..