పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని తోబా టేక్ సింగ్ నగరంలో ఒక అన్న తన సోదరిని వారి ఇంటిలో గొంతు కోసి హత్య చేశాడు. పరువు హత్యగా అనుమానిస్తున్న ఈ భయంకరమైన చర్య ఈ మర్చి నెల మొదట్లోనే జరగగా.. ఆ హత్య చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఫుటేజీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైరల్ వీడియోలో.. చనిపోయిన మహిళ 22 ఏళ్ల మారియానుగా పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో వ్యక్తి తన చెల్లి గొంతు కోసి చంపడాన్ని చూడవచ్చు. బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ వ్యక్తి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపడం పూర్తి చేసిన వ్యక్తికి ఆమె తండ్రి నీటి సీసాని అందచేయటం కొసమెరుపు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.., మార్చి 17 లేదా 18వ తేదీ అర్ధరాత్రి ఈ నేరం జరిగిందని.. నేరస్థులు మహిళ మృతదేహాన్ని పాతిపెట్టారని తెలిపారు. మార్చి 24న ఈ నేరం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇంతటి ఘోరమైన నేరానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, ఈ వీడియోను చూసిన చాలా మంది ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ٹوبہ ٹیک سنگھ کے علاقے 477 ج ب میں بھائی نے بہن کو باپ اور ایک اور شخص کی موجودگی میں گلہ دباکر قتل کردیا۔ pic.twitter.com/GqRsVxiH2l
— صحرانورد (@Aadiiroy2) March 27, 2024