NTV Telugu Site icon

Paris Olympics: ఒట్టిచేతులతో భారత్ కు వినేష్ ఫోగట్..!

Vinesh Phogat Hospitalised

Vinesh Phogat Hospitalised

వినేశ్‌ ఫోగట్‌ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆగస్టు పదిన ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ.. పారిస్‌ స్పోర్స్‌ కోర్టు తీర్పు వాయిదా వేసింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో వినేష్ ఫోగట్‌ పిటిషన్ పై విచారణ జరిగింది. కనీసం ఆదివారమైనా తీర్పు వెలువడుతుందని అందరూ ఆశించారు. కానీ ఈ నెల 13న తీర్పు వెలువడనుంది. కాగా.. అదే రోజు వినేష్ ఫోగట్ భారత్ కు తిరిగి రానుంది. అయితే ఒట్టి చేతులతో ఆమె పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తీర్పు పూర్తివకుండానే భారత్ కు తిరిగి రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Strange Incident: హెర్నియా ఆపరేషన్కు వెళ్లిన వ్యక్తి శరీరంలో గర్భాశయం.. షాకైన డాక్టర్లు

పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసిన తర్వాత.. ఇప్పుడు భారత అథ్లెట్లు దేశానికి తిరిగి వస్తు్న్నారు. ఈ బృందం మంగళవారం (ఆగస్టు 13) ఉదయం తిరిగి రానుంది. వారితో పాటు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా తన ఇంటికి తిరిగి వస్తుంది. వినేష్ రజత పతకానికి సంబంధించి కూడా అదే రోజు నిర్ణయం తీసుకోనున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు కంటే ఆమె బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నందున పోటీకి ముందు అనర్హత సాధించిన విషయం తెలిసిందే.

READ MORE: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయని తెలిసిందే. దీని కోసం, 117 మంది సభ్యులతో కూడిన భారత బృందం పారిస్‌కు వెళ్లింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు. అయితే ముగింపు వేడుకలో ‘పరేడ్ ఆఫ్ నేషన్స్’కి భారత పతాకధారులుగా పిఆర్ శ్రీజేష్, మను భాకర్‌తో సహా ఇతర అథ్లెట్లు.. భారత బృందం మంగళవారం (ఆగస్టు 13) ఉదయం దేశానికి తిరిగి వస్తారు.

Show comments