Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు గోల్డ్ మెడల్!
- నేడు వినేశ్ ఫొగాట్ పుట్టినరోజు
- విభిన్నంగా సత్కరించిన గ్రామ పెద్దలు
- పోరాటం ఇంకా ముగియలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat Birthday: నేడు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బలాలి గ్రామ పెద్దలు (సర్వ్ ఖాప్) ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ సహా మరికొందరు పాల్గొన్నారు. వినేశ్‌ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే సర్వ్ ఖాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే నేడు వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. నేటితో ఆమె 30వ పడిలోకి అడుగుపెట్టారు.
ఈ సత్కార కార్యక్రమంలో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ… ‘నా పోరాటం ఇంకా ముగియలేదు. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్లో ఆడలేకపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను ఎంతో దురదృష్టవంతురాలిని అని భావించా. కానీ స్వదేశంలో నాకు దక్కిన మద్దతు చూశాక అదృష్టరాలిని అని అనిపించింది. ఇలాంటి మద్దతు ఇతర మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నా. నాకు ఇచ్చిన ఈ మెడల్ కంటే మరేదీ గొప్ప గౌరవం కాదు’ అని చెప్పారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
Also Read: Joe Root: ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్!
పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును మూడుసార్లు వాయిదా వేసింది. చివరకు నిరాశ తప్పలేదు. తీవ్ర మనో వేదనతో పారిస్ నుంచి భారత్‌కు చేరుకున్న వినేశ్కుఘన స్వాగతం లభించింది. ఆమె స్వగ్రామం బలాలిలోనూ గ్రాండ్ వెల్కమ్ దక్కింది.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!