వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువేత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లంద గ్రామ సర్పంచ్ కు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.. వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుంది.. సర్పంచ్ బేతి సాంబయ్య కు వచ్చిన ఆలోచనతో కోతులను భయపెట్టేందుకు చింపాంజీ రూపంలో సిబ్బందికి వేషాలు వేయించారు.
Also Read:Kidnap At Tirupati: 13 నెలల చిన్నారి కిడ్నాప్.. గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందం..!
సొంత నిధులు వెచ్చించి చింపాంజీ మాస్క్ లు తెప్పించారు. ఇల్లంద గ్రామ పంచాయతీ పాలకవర్గం,సిబ్బంది లో పారిశుద్ధ కార్మికులు ఇలా చింపాంజీ వేషాలు ధరించి కోతులను పరుగులు పెట్టిస్తున్నారు.. ఎక్కువగా కోతులు సంచరించే కాలనీలో ఇలా చింపాంజీ వేషాలు ధరించి కోతుల వెంట పడుతున్నారు. చింపాంజీ వేషధారణలో సిబ్బంది పరుగులు పెడుతూ.. కోతులను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి.
Also Read:Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!
చింపాంజీ వేషధారణలో పంచాయతీ సిబ్బంది చేస్తున్న హావభావాలు.. చేష్టలు చూసి భయంతో కోతులు తుర్రుమని పారిపోతున్నాయి.. సిబ్బందికి వేషాలు ధరించడం కాస్త ఇబ్బందిగా ఉన్న కోతుల నుండి ప్రజలకు విముక్తి లభించడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఐడియా అదుర్స్ అని ప్రజలు అంటుంటే కోతుల సమస్య పరిష్కారానికి మాకు ఇంతకు మించిన మార్గం కనిపించలేదని సర్పంచ్ బేతి సాంబయ్య చెప్పారు.