భారత విదేశాంగ కార్యదర్శిగా.. దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ) విక్రమ్ మిస్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జూలై 15న విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. విక్రమ్ మిస్రీ 1989 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి. ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వినయ్ క్వాట్రా (Vinay Kwatra) పదవీకాలం 2024 ఏప్రిల్ 30తో ముగిసింది. ఆయన పదవీకాలాన్ని ఏప్రిల్ 30 నుంచి జూలై 14 వరకు పొడిగిస్తూ కేంద్రం 2024 మార్చి 12 ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల మేరకు ఆయన జూలై 14 వరకు విదేశాంగ కార్యదర్శిగా కొనసాగుతారు. అనంతరం విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరిస్తారు.
READ MORE: Pune Video: ఎయిరిండియా విమానం రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం
విక్రమ్ మిస్రీ డిసెంబర్ 2021లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అతను ఫారిన్ సర్వీస్ అధికారి మరియు డిసెంబర్ 11 వరకు చైనాలో రాయబారిగా పనిచేశాడు. ఆయన నుంచి ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు.
READ MORE:Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్
విక్రమ్ మిస్రీ 7 నవంబర్ 1964న శ్రీనగర్‌లో జన్మించారు. అతను ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు.అతను ఎంబీఏ కూడా పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు, అతను మూడు సంవత్సరాలు అడ్వర్టైజింగ్.. యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లో పనిచేశారు. అతను ఇంగ్లీష్, హిందీ మరియు కాశ్మీరీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు మరియు ఫ్రెంచ్ భాషలో కూడా పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. విక్రమ్ మిస్రీ డిసెంబర్ 2021లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అతను ఫారిన్ సర్వీస్ అధికారి, డిసెంబర్ 11 వరకు చైనాలో రాయబారిగా పనిచేశారు.