NTV Telugu Site icon

Vikarabad Murder Case : సినిమా రేంజ్‌లో హత్య.. చివరికి

Hyd Murder

Hyd Murder

హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసి డిమాండ్లకు తరలిస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లక్ష్యనాయక్ తాండ కు చెందిన విట్టల్ హత్యను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందుతులు ప్రయత్నించారు. అయితే.. ఈ విఠల్‌ మరణంపై అనుమానం ఉండటంతో ఆమె భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్ని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. వికారాబాద్ జిల్లా తాండాలో అధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డు తొలగించుకోవాలని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన హత్యను కేసును ఛేదించారు వికారాబాద్ పోలీసులు.

Also Read : Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుంది

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడు కుటుంబీకులు విఠల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు అచర్యకరమైన విషయాలు వెలుగులోకి తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుఫాన్ వాహనంతో ఢీకొట్టి హత్యకు పాల్పడ్డారు.

Also Read : Poisonous Food: చికెన్‎లో చనిపోయిన ఎలుక.. లూథియానాలో దాబా యజమానిపై కేసు

విచారణలో.. కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గల తుఫాన్ తో గుద్ది హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ల రూపాయల సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. హత్య కేసులో మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ కోటి రెడ్డి వెల్లడించారు.