Vikarabad SP: తండ్రి దొంగ.. కొడుకు గజదొంగ.. ఇద్దరిపై 105 కేసులు!
- ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు
- ఇద్దరు దొంగలు తండ్రి కొడుకులు
- ఇప్పటికే వారిపై నాలుగు రాష్ట్రాల్లో 105 కేసులు
- ఏపీలోని గుంతకల్ కు చెందిన వారిగా గుర్తింపు
- గతంలో పరిగిలో చోరీ
- పుణేలో విరిని పట్టుకుని కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు. వీరిని పట్టుకోవడంలో వికారాబాద్ పోలీసులు విజయం సాధించారు. అసలు విషయం ఏమిటంటే.. వికారాబాద్ పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు దొంగల పైన 105 కేసులు ఉన్నాయని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్పీ సమాచారం మేరకు.. తండ్రి కొడుకు ఇద్దరు దొంగలే. వీళ్లను షికారి గ్యాంగ్ దొంగలు అంటారు. వీళ్ళ ఇద్దరిదీ ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్. ఇద్దరు దొంగల పైన ఇప్పటికే రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఇద్దరు దొంగలను పూణేలో పట్టుకున్నారు.. వికారాబాద్ పోలీసులు. ఇద్దరి నుంచి ఏడుతులలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడులోని ఈ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. 30/6/2024 రోజున పరిగి పట్టణంలోని ఐదు ఇళ్లలో ఈ షికారి గ్యాంగ్ చోరీ చేసింది. వీళ్లు దొంగతనం చేయడానికి ప్రతి సారి ఒక కొత్త వ్యక్తిని తమ వెంట తీసుకోస్తారు.
READ MORE: Bulldozer action: ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ఈ షికారి గ్యాంగ్ రైలు, బస్సు మార్గంలో వచ్చి తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. పగలు రక్కి నిర్వహిస్తారు.. రాత్రి చోరీ చేస్తారు. ఏ వన్ పెద్ద సర్దార్ (రాజు ) తండ్రి. ఏ టూ మద్దిలేటి మధవ కొడుకు. ఏ వన్ తండ్రి పైన 70 కు పైగా దొంగతనం కేసులు అదేవిధంగా కొడుకు మాధవ పైన 42 కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా సిసిటి ఎస్ఎస్ పోలీసులు ఈరోజు తండ్రి, కొడుకు ను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేదించడంలో ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ రివార్డు ఇవ్వడం జరిగింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!