Vijaysai Reddy:చంద్రబాబు ముసలి నక్క..లోకేష్ గుంట నక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. పార్టీ కార్యాలయం నా దృష్టిలో దేవాలయం లాంటిది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక వేదిక అన్నారు విజయసాయి.
టీడీపీ పార్టీ అధ్యక్షుడిని అసభ్య పదజాలంతో మాట్లాడటం ఈ మధ్య ప్రారంభమైంది. లోకేష్ పుట్టుకతోనే డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇద్దరూ మిస్ ఇన్ఫెక్షన్ క్యాంపైన్ ప్రారంభించారు. ముసలి నాయుడు, పప్పు నాయుడు ..ఇద్దరూ ఈ వైఖరి మానుకోవాలి. నేనూ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు అనారోగ్యం, ఇతర కారణాలతో ఫెయిల్ అయ్యాను. ప్రభుత్వానికి విద్యార్థులు ఫెయిల్ అవటానికి సంబంధం ఉండదన్నారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
కుసంస్కారం ఉన్న వాళ్ళను తెచ్చి తిట్టించటం కాదు. మీరు ఒకటి చెబితే… మేం పది చెబుతాం. ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు చేయవచ్చు. నిన్నటి జూమ్ ఆరంభం మాత్రమే. పప్పు నాయుడు సవాలును స్వీకరిస్తున్నాం. చంద్రబాబు అయినా రావచ్చు…మా నాయకులు ఎవరైనా చర్చకు సిద్దమే. ఎక్కడైనా, ఎప్పుడైనా… చర్చకు మేం సిద్ధం అన్నారు విజయసాయి. నిన్న లోకేష్ పారిపోయాడు. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయటం లేదు? పోటీ చేసి ఆ ఫలితాలనే రెఫరెండంగా తీసుకోవాలి. టీడీపీ నాయకులు నోటికి తోచినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విజయసాయి హెచ్చరించారు.
రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి చేతుల పై ఆఫీసు ప్రారంభం చాలా సంతోషంగా ఉంది.పార్టీ నిర్మాణం కోసం ఆఫీసు ఉండాలని నిర్ణయించారు. ఆ వెంటనే జిల్లా అధ్యక్షుడు వెంటనే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. జిల్లా స్థాయి నాయకులు అందరూ పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారన్నారు. పార్టీని బలోపేతం చేయటానికి శాయశక్తులా కృషి చేస్తాం. అందరినీ కలుపుకుని సమన్వయంతో పని చేస్తాం అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వెల్లంపల్లి బాధ్యత లు తీసుకున్నారు. ఈ ఏడు నియోజకవర్గాల్లో గెలుపు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గా నేను కృషి చేస్తానన్నారు హోంమంత్రి తానేటి వనిత.
President : రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లున్నాయి? కౌన్ బనేగా ప్రెసిడెంట్?
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!