NTV Telugu Site icon

Vijay Thalapathy: విజయ్ కీలక నిర్ణయం.. ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు!

Thalapathy Vijay

Thalapathy Vijay

TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్‌ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్‌ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదని తమిళగ వెట్రి కళగం తెలిపింది.

తమిళనాడు రాష్ట్రంలోని విక్రవాండి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతేకాదు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. దాంతో తమిళగ వెట్రి కళగం నేడు ఓ లేఖ రిలీజ్ చేసింది. ‘తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు. విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదు. అంతేకాదు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి టీవీకే మద్దతివ్వదు’ అని పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో విజయ్‌ రాజకీయ పార్టీని ప్రకటించి.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

Also Read: Gold Price Today: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

ప్రస్తుతం విజయ్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)తో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Show comments