ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు.
READ MORE: MLC Kavitha : ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురింపించిన ఎమ్మెల్సీ కవిత
అక్కడికి వెళ్ళాక యువతి కాళ్లు చేతులు కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న 20 గ్రాముల బంగారం దోచుకున్నాడు. గుంటూరులో బంగారం అమ్మి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. బంగారం అమ్మగా వచ్చిన డబ్బులు బెట్టింగ్‌లో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇదే విధంగా మరో ఇద్దరు అమ్మాయిలని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నాగతేజాపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎంత మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
READ MORE: MLC Kavitha : ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురింపించిన ఎమ్మెల్సీ కవిత
