Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Drugs Bust: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ రవాణాపై నిఘా పెట్టిన ఈగల్, జీఆర్పీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.. ఈ తనిఖీల్లో 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తో ఓ యువతి పట్టుబడింది.. బెంగళూరు నుంచి విజయవాడకు మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.. పక్కా సమాచారంతో విజయవాడ రైల్వే స్టేషన్లో యువతిని అదుపులోకి తీసుకున్న ఈగల్, జీఆర్పీ బృందాలు.. ఆమె నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు..? విజయవాడలో ఎవరికి సరఫరా చేయబోతున్నారు..? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్ తో పట్టుబడిన యువతి విజయవాడ పటమటకు చెందిన యలమశెట్టి సౌమ్యగా పోలీసులు గుర్తించారు.
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా పెట్టిన ఈగల్, జీఆర్పీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తో ఓ యువతి పట్టుబడింది. బెంగళూరు నుంచి విజయవాడకు మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. పక్కా సమాచారంతో విజయవాడ రైల్వే స్టేషన్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.10 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
- RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
డ్రగ్స్‌తో పట్టుబడిన యువతిని విజయవాడ పటమటకు చెందిన యర్రమశెట్టి నాగ సౌమ్యగా గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న క్రమంలో ఈగల్, జీఆర్పీ బృందాలు ఆమెను పట్టుకున్నాయి. అనంతరం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడలో పలువురికి ఈ మత్తు పదార్థాలను విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించారు?, విజయవాడలో ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు?, ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
నాగ సౌమ్యకు సంబంధించిన మరో అంశం కూడా దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది ఆమె ప్రియుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నాగ సౌమ్య డ్రగ్స్ కొరియర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. అయితే గత కేసుకు, ప్రస్తుత డ్రగ్స్ రవాణా వ్యవహారానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ తనిఖీలతో నగరంలో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరోసారి దృష్టి పడింది.
- Tags
- ap
- Drugs
- Mba student
- MDMA
- vijayawada
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..