Site icon NTV Telugu

Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!

Nude Video Call

Nude Video Call

Vijayawada: గత కొద్ది కాలంగా సమాజంలో సోషల్ మీడియా సంబంధించిన అనేక ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి అలాగా ఉండగా మరికొందరు దిగిజారి బతికేస్తున్నారు. తాజాగా విజయవాడలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భవానీపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్‌లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!

పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు గత రెండు సంవత్సరాలుగా ఆ మహిళను న్యూడ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని, ఆమె భర్తను హత్య చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపుల కారణంగా బాధితురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఇప్పటికే నిందితుడు బాధితురాలితో రూ.21 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా మరో రూ.2 కోట్లు ఇస్తే ఫొటోలను డిలీట్ చేస్తానని డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వేధింపులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే వారు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు.

SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

దీనితో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జోజి నగర్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న వెంకటేశ్వర్లు ఇప్పటివరకు మూడు వివాహాలు చేసుకున్నాడని తెలిసింది. అతని ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు మరికొన్ని మహిళల న్యూడ్ ఫొటోలు కూడా లభించడంతో మరింత షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది మహిళలు బాధితులయ్యారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Exit mobile version