Site icon NTV Telugu

Vijayashanti : సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యాను

Vijayashanti

Vijayashanti

బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం.. బీజేపీ సిద్దాంతం, క్రమశిక్షణ నచ్చి 1998 లో పార్టీ లో చేరానన్నారు. తెలంగాణకు ఏదో చేయాలని తపన ఎప్పుడు ఉండేదని, సోనియా గాంధీకి పోటీగా ఉండాలని అద్వానీ చెప్పారన్నారు. సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యానని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూలి పోయే పరిస్థితి వచ్చిందని, బ్లాక్ మెయిల్ చేశారన్నారు. సమైక్య వాదుల ఒత్తిడి వల్ల 2005లో నేను బీజేపీకి రాజీనామ చేశానని, తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఎన్నో వ్యయ పర్యవసానాలు ఎదుర్కొన్నానన్నారు. ఆ సమయంలో ఒక రాక్షసుడు కేసీఆర్‌ ఎంటర్ అయ్యాడని, నమ్మదగ్గ వ్యక్తి కాదని నాకు అప్పుడే అర్థం అయిందన్నారు. లొంగదీసి పార్టీలో విలీనం చేసుకోవాలని చూసాడన్నారు.

Also Read : Rahul Jodo Yatra: ఝలక్ ఇచ్చిన భద్రతా సిబ్బంది.. జోడో యాత్ర నిలిపివేత

వ్యక్తిత్వాన్ని కించ పరిచే ప్రయత్నం చేశాడని ఆమె వ్యాఖ్యానించారు. తప్పని సరి పరిస్థితిలో విలీనం చేశానని, ఏనాడు సంతృప్తిగా లేనన్నారు. నన్ను ఎంపీగా ఓడగొట్టాలని కేసీఆర్‌ చూసాడని ఆమె ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను టీఆర్‌ఎస్‌ నుండి సస్పెండ్ చేశారని, నాకు నేనే పార్టీ వదిలి వెళ్ళిపోయాను అని కేసీఆర్‌ అబద్ధాలు చెప్పాడన్నారు. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి అందమైన తెలంగాణ వెళ్ళిందని, మళ్ళీ నా ఇంటికి (బీజేపీ) నేను వచ్చానన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి పరిపాలనా అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తుందన్నారు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ కోసం పని చేస్తానని, కేసీఆర్‌ను గద్దె దించాలి… అందరం కలిసి టీమ్ వర్క్ గా పని చేద్దామన్నారు. ఒక్క సారి గట్టిగా పని చేస్తే బీజేపీ అధికారం లోకి వస్తుందని, మరొక్క సారి కేసీఆర్‌కి అధికారం ఇస్తే ఎవరు బతకరన్నారు. కేసీఆర్‌ విష సర్పం… కింద నుండి నరుక్కొని వస్తాడని, కేసీఆర్‌ మాయ మాటలకు మోస పోవద్దన్నారు విజయశాంతి.

Also Read : Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు

Exit mobile version