Vijayashanthi Poster Out Form NKR21 Movie నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకతంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NKR21’. యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మరో ఫస్ట్ లుక్ వదిలారు. ‘లేడీ సూపర్ స్టార్’ విజయశాంతి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది.
ఈరోజు విజయశాంతి బర్త్ డే. ఈ సందర్భంగా మూవీ నుంచి రాములమ్మ ఫస్ట్ లుక్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘వైజయంతి ఐపీఎస్’ అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. 34 సెకండ్ల నిడివి గల గ్లింప్స్‌లో విజయశాంతి పవర్ పెర్ఫామెన్స్ హైలెట్‌గా ఉంది. ‘వైజయంతి ఐపీఎస్. తను పట్టుకుంటే.. పోలీస్ తుపాకికి ధైర్యం వస్తుంది. వేసుకుంటే.. యునిఫామ్‌కి పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం.. మేమే తన సైన్యం’ అనే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారు ‘రాములమ్మ’ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: South Africa vs West Indies: సెమీస్‌కు దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ ఇంటికి! ఇక మిగింది గ్రూప్1
‘కర్తవ్యం’ తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో విజయశాంతి కనిపించనున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి చేస్తున్న సినిమా ఇదే. ఇక గ్లింప్స్‌లో కళ్యాణ్ రామ్ కూడా కనిపించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.